పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పాత పశువుల సంత వద్ద ఆటో బైకు ని క్రాస్ చేయబోయి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానికులు తెలిపిన వివరాల మేరకు లింగం గుంట్లకు చెందిన ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా వేగంగా ఆటో ఢీ కొట్టిందన్నారు. స్థానికులు 108 సమాచారం అందించగా క్షతగాత్రులకు సిబ్బంది శోభన్ ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.