ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అనుమతులు లేకుండా ఎవరైనా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం లేదా రాజకీయ సభలు పెట్టడం వంటివి చేయరాదని అలా ఏవైనా చేయవలసి వస్తే పోలీసు వారి అనుమతితో మాత్రమే చేయాలి అని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు.