దేవనకొండ మండల కేంద్రంలో ఆదివారం ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై పశువుల సంచరించడంతో స్థానికులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి పలు చోట్ల రహదారులపై తిష్ట వేస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాటిలో అవే గొడవలు పడుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. అధికారులు వాటి యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోండి. గత నెల ఆలూరులో ఆవు దాడిలో వృద్ధుడు మృతి చెందిన విషయం తెలిసిందే