కూకట్పల్లిలో గృహిణి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేదించారు. నిందితులు హర్ష కుమార్, రోషన్ సింగ్ గృహ సహాయకులుగా గుర్తించారు. వీరికి సహాయం చేసిన రాజు వర్మతో కలిసి జార్ఖండ్ లోని రాంచి వద్ద అరెస్టు చేశారు. మహిళను కట్టేసి, గొంతు కోసి హత్య చేసి, బంగారం, నగదు, 16 గడియారాలు, మొబైల్ ఫోన్లు, హౌస్ కీలు దోచుకుని వెళ్లినట్లు సిపి తెలిపారు.