ఒకటవ తేదీకే తెల్లారితే లబ్ధిదారుల చేతిలో పింఛనే ఉంటుందని వారి కళ్ళల్లో ఆనందం కనబడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు నేడు ఒకటో తారీకు సందర్భంగా కాకినాడ జగన్నాధపురం 21వ డివిజన్లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదగా లబ్ధిదారులకు వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క అవ్వ తాత ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని వారికి అందిన పించలతో చాలా సంతోషంగా గడుపుతున్నారని అన్నారు.