రాజాపూర్ మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన ఆలయంలో వీరభద్రుడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. అలాగే ఈ ఆలయంలో ఉత్తర నక్షత్ర శుభ ముహూర్తమున యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, బలిహరణ, జయాది హోమం, పూర్ణహృతి కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ సుభిక్షం కోసమే ఆలయ నిర్మాణం చేపట్టినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.