నంద్యాల జిల్లా డోన్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాత మానస సరోవరం యాత్ర కోసం నేపాల్కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆమె సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్లు టీడీపీ ముఖ్య నాయకులు తెలిపారు. సుజాతతో మంత్రి లోకేశ్ ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆమె ఇక్కడికి వస్తారని పేర్కొన్నారు.