ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ ఉద్యోగులు శనివారం ఉదయం ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటి డ్యూటీల పేరుతో శ్రమదోపిరికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలకు పైబడి ఉన్న ఆర్టీసీ డ్రైవర్లలు అనారోగ్యాలతో ఉన్న కూడా టీం డ్రైవర్లుగా నియమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడుతామని అన్నారు.