సిర్పూర్ నియోజకవర్గం లోని పలు మండలాలలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూరు, కాగజ్ నగర్ తదితర మండలాలలో వినాయకునికి తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రగా వినాయకులను నిమజ్జనం చేయడానికి చిన్న పెద్ద తేడా లేకుండా భక్తిశ్రద్ధలతో నృత్యాలు చేస్తూ ప్రజలందరూ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటున్నారు,