ఏలూరు జిల్లా ప్రసిద్ధ ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల లెక్కింపు సోమవారం స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో జరిగింది. ఈమేరకు హుండీల ద్వారా చినవెంకన్న ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. గడచిన 38రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3కోట్ల61లక్షల 54వేల 678 రూపాయల ఆదాయం అలాగే భక్తుల కానుకలు రూపేణా 261 గ్రాముల బంగారం, 6కేజీల 834 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని ఆలయ ఈవో మూర్తి వివరించారు.