గద్వాల జిల్లాలో విత్తన పత్తి రైతులపై కంపెనీలు, ఆర్గనైజర్ల దోపిడీ పెరిగిందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ఆర్గనైజర్లు నకిలీ ఫెయిల్ లిస్టులను వ్యవసాయ శాఖకు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రైతు సంక్షేమ కమిషన్ సూచన మేరకు జీవోటి ఫలితాలతో సంబంధం లేకుండా రైతులందరికీ పేమెంట్ చేయాలన్నారు.