వినాయకచవితి సందర్బంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఎంపీ దంపతులు పూజలు చేసి హరతులిచ్చారు. కర్నూలు జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు.