2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ప్రజల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం చెన్నూరు మండల కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.