3జనరల్ బార్లకు ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీలేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డి బుధవారం సాయంత్రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ప్రభుత్వం వారు నూతనంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయదలచిన 3 జనరల్ బార్లకు దరఖాస్తులు కోరుతూ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైస్ అధికారి జి. మధుసూదన్ గజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. రాయచోటిలో -1,మదనపల్లిలో -1,తో పాటు పీలేరు నందు -1 బార్ కు దరఖాస్తులు కోరినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14న సాయంత్రం 6గంటల వరకు సమయం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉ. 8 గంటలకు డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు