కోడుమూరు తహసీల్దార్ నాగరాజు, వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ బుధవారం మధ్యాహ్నం వెంకటగిరి గ్రామంలో ఉల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉల్లి పంటకు క్వింటాలు రూ.1200 ప్రకారం మద్దతు ధర ప్రకటించడం జరిగిందన్నారు. ఉల్లి పంటను 120 రోజుల అనంతరం తీయడం వలన కాయ నాణ్యత పెరిగి దిగుబడి పెరుగుతుందన్నారు. పంట నమోదు కచ్చితంగా చేయించుకోవాలని రైతులకు సూచించారు. మద్దతు ధర అమలులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.