ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. ఉదయం నుంచే వేచి ఉన్నప్పటికీ సాయంత్రం వరకు ఎరువులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ సమయంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, తక్షణమే సరఫరా పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. బ్లాక్లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.