కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం స్థానిక బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమా సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ ప్రమాణస్వీకారంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్గా సత్యనారాయణ రెడ్డి చేత ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి కుటుంబం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.