నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ సమితి విశ్వహిందూ పరిషత్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు ఓరుగంటి గుణవంతు జోషి మాట్లాడుతూ ఈనెల 27న బుధవారం చవితి రోజున వినాయక ప్రతిష్టాపన చేయాలని సూచించారు. నవరాత్రుల అనంతరం వచ్చేనెల సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి శనివారం రోజున రాత్రి 12 గంటల లోపు నిమజ్జనం చేయాలని అన్నారు. ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం ఉన్నందున వినాయక మండపాల నిర్వాహకులు 11 రోజులకే నిమజ్జనం చేయాలని కోరారు.