ప్రభుత్వం నూతనంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 11 ఓపెన్ బార్లకు మరియు ఒక రిజర్వ్‌డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయింపు జరిపినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో బార్ల కేటాయింపు లాటరీ డ్రా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ, మదనపల్లి డివిజన్‌లో మూడు బార్లు, రాయచోటిలో రెండు బార్లు, రాజంపేటలో రెండు బార్లు మరియు కల్లుగీత కార్మికులకు ఒక రిజర్వ్‌డ్ బార్ సహా మొత్తం 11 ఓపెన్ బార్లకు మరియు ఒక రిజర్వ్‌డ్ బార్‌కు లాటరీ ద్వారా కేటాయించామని వివరించారు.