అల్లూరి జిల్లా అరకులోయ డుంబ్రిగుడ మండలం సొవ్వా ఘాట్ రోడ్లో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు డీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన గుడియా లవకుశ, మృతి చెందగా పారటి యుగేంద్ర, నాయుడు కు తీవ్ర గాయాలు. స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.