నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో మున్సిపల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కు నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను గురువారం పరిశీలించారు. ప్రహరీ గోడ నిర్మాణ ప్రాంతంలో ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి, నిర్దేశించిన సమయంలోపు నాణ్యతతో పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.