సంతమాగులూరు మండలం పుట్టవారి పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక లారీలో ఉన్న డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై పట్టాభిరామయ్య సంఘటన స్థలానికి చేరుకొని లారీ డోర్ ను పగలగొట్టాడు. డ్రైవర్ మృతి చెందడంతో అతన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.