తిరుపతి జిల్లా గూడూరు నియోజక వర్గం చిల్లకూరు మండలం చింతవరం గ్రామస్థులు శనివారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ను కలసి పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి సమస్యలను అధికారులకు తెలిపి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.