జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి జిల్లాలోని నదులు, వాగులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, చెరువులలో ఇసుక లభ్యతపై రెవెన్యూ, గనులు భూగర్భ శాఖ, నీటిపారుదల శాఖ, నీటి వనరుల శాఖ, అటవీశాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కమిటీ సమావేశం నిర్వహించారు.