ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం రాచర్ల రైల్వే గేట్ విరిగిపోవడం వల్ల దాదాపు అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పాఠశాలలు విడిచి పెట్టే సమయం కావడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రైల్వే అధికారులు విరిగిన గేటును తొలగించి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. విరిగిన గేటుకు అధికారులు మరమ్మతులు చేపట్టి తాత్కాలిక రైల్వే గేటును ఉపయోగిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.