శనివారం రాత్రి విజయవాడ అయోధ్య నగర్ లో గణపతి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో బిజెపి మహిళ నేత నాగలక్ష్మి పై సింగనగర్ ఎస్సై దురుసుగా ప్రవర్తించారని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించారు. ఆదివారం సాయంత్రం సమయంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకొని సింగ్ నగర్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల పేర్కొన్నట్లు తెలిపారు. సిఐ లక్ష్మీనారాయణ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని బిజెపి నేతలకు తెలిపారు.