అమెరికా టారిఫ్ల (సుంకాలు) పెంపునకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు హోళగుంద బస్టాండ్ లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సార్వభౌమత్వ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని, ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ట్రంప్ సర్కార్ భారత ప్రయోజనాలను సార్వభౌమత్యాన్ని దెబ్బ తీస్తున్నా,కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దేశ ప్రజలను అవమాన పరచడమేనని, వారు పేర్కొన్నారు.