తాను నేచర్ లవర్ని అని , అటవీ సంపదను కాపాడుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులకు 3.90 కోట్ల నిధులతో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 300 ల ఎకరాల్లో అర్బన్ పార్క్ నిర్మాణంతో వాతావరణం సమతుల్యం అవుతుందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. జూకల్లో 1.15 కో ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.