ప్రకాశం జిల్లా దర్శి సమీపంలోని పంట పొలాలలో కరెంటు స్తంభం కూలిపోయే పరిస్థితిలో ఉందని కథనం ప్రచారం కావడంతో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే స్పందించారు. సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతు లింగయ్య పొలంలో ఉన్న స్తంభాన్ని సరిచేయాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ అధికారులు వెంటనే స్తంభాన్ని సరి చేయడంతో రైతు లింగయ్య డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి కృతజ్ఞతలు తెలిపారు.