వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీని చందానగర్ డివిజన్ లోని భవానిపురం వీకర్ సెక్షర్ కాలనీవాసులు సోమవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని వారికి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.