ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కే ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్నారు. ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన గురుపూజ మహోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచర్ల సత్య ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ అవార్డు తీసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందిన కిరణ్ కుమార్ ను పలువురు అభినందించారు.