కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో గత 10 రోజులుగా యూరియా ఇవ్వడం లేదంటూ కామారెడ్డి కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు రైతులు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇచ్చి పది రోజులు గడుస్తున్నా ఇంకా సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.