బెచ్చురు మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన రంగనాయక స్వామి ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మూసివేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగడపల్లి మహేష్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్వామివారి ని దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు,