ద్రాక్షారామలో గురువారం ఆటో డ్రైవర్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన కార్య క్రమం చేపట్టారు. స్త్రీ శక్తి పథకం స్వాగతించదగిన కార్యక్రమమే అని, అయితే ఆటో డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపిందని యూనియన్ గౌరవ అధ్యక్షుడు మాగాపు అమ్మిరాజు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.