నల్లగొండ జిల్లా కోర్టు న్యాయవాది వెంకటయ్య పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం దేవరకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అడ్వకేట్ కమిషనర్ గా వెళ్లిన న్యాయవాదిపై ప్రతివాదులు దాడి చేశారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమామహేశ్వర్ లోహిత్ రెడ్డి, రాములు, జగదీశ్వర్ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.