ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించి నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి హాజరై మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, అబద్ధపు ప్రచారాలపై కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని, రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని హెచ్చరించారు.