కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం లోని టిడిపి కార్యాలయంలో గురువారం తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే మంత్రి నారా లోకేష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని, ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారన్నారు.రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారన్నారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని తెలిపారు.