జక్రంపల్లి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు నట్ట భోజన్న తమ్ముడు నిఖిల్ గత వారం రోజుల క్రితం మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం మధ్యాహ్నం 2:30 మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపి మనోధైర్యాన్ని అందజేశారు.