సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా డిఈఓ ను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 12 గంటలు మెగా డీఎస్సీ 2025 కు సంబంధించి నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న శ్రీనివాస బీఎడ్ కాలేజీ లో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలిస్తూ వెరిఫికేషన్ గురించి అధికారులతో ఆరా తీశారు... సర్వర్ సమస్యలు లేకుండా, నిరంతర విద్యుత్ సౌకర్యంతో హై ఇంటర్నెట్ స్పీడ్ తో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.