Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నాబార్డు నిధులు రూ.118.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం విద్యాభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిడి రామలింగం, స్థానిక టిడిపి నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు