పాణ్యం మండలంలోని పలు గ్రామాలలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది.వద్దుగండ్ల-రసూల్ పేట గ్రామాల మధ్య కావేరి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు కాలనీలలోని ఇళ్లలోకి నీరు వస్తుందని స్థానికులు వాపోతున్నారు.