దర్శి పట్టణంలోని పడమర బజార్లో శంకర అనే యువకుడు గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొడ్డపాటి లక్ష్మి బుధవారం వారి స్వగృహం వద్దకు వెళ్లి శంకర్ పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. టిడిపి పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకుల తదితరులు పాల్గొన్నారు.