ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏపీ ఇంచార్జి విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తప్పుడు సర్వే రిపోర్ట్‌ల ఆధారంగా బాధితుడికి అన్యాయం జరిగిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని, భూమిపై అన్యాయం జరగకుండా చూడాలన్నారు.