చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ గ్రామంలోని హైస్కూల్లో పురుగులు ఉన్న బియ్యం వచ్చినట్లు మీడియాకు సమాచారం వచ్చింది. ఈ విషయమై విచారణకు వెళ్లిన చల్లపల్లి తహసీల్దార్ వనజాక్షి పేరెంట్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్పర్సన్ కుంభా దుర్గాభవానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఫోటోలు తీసి మీడియా వారికి పంపించారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తొలగించాలని అధికారులకు తెలిపారు.