కర్నూలులో ముగ్గురు పోలీసుల పై సస్పెన్షన్ వేటు క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను, ఒక హోంగార్డును కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సస్పెండ్ చేశారు.జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం రాత్రి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్ జె.శ్రీరామ్ ప్రసాద్ – నాలుగో పట్టణ పోలీసు స్టేషన్, కానిస్టేబుల్ రాజేష్ – తాలుకా యుపిఎస్, హోంగార్డ్ నబీషా ట్రాఫిక్ పియస్ సస్పెండ్ చేశారు.ఇటీవల నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రాబరి కేసు (క్రైమ్ నెంబర్ 292/2025) ముద్దాయిలను రిమాండ్‌కు తరలించినప్పుడు, నేరానికి సంబంధించి కీలక సమాచారం తెలిసినా పై అధికా