రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ సంబురాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ప్రారంభించగా, బతుకమ్మ పాటలకు మహిళా అధికారులు, సిబ్బంది ఆడిపాడారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కలెక్టర్ తెలియజేశారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డీవై ఎస్ఓ రాందాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లత, భారతి, రవీందర్ రెడ్డి,