శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులకు త్రాగునీటి ఆర్వో ప్లాంట్ ను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషములకు ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలను అనే విధాలుగా ఆర్థిక స్వాలంబన చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు స్త్రీ శక్తి పథకం ప్రారంభించిందని, మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.