శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్లను విడుదల చేశారు. వైయస్సార్సీపి ఆధ్వర్యంలో 8వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.