బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్లిన ఓ బాధితుడు తనను స్వగ్రామానికి రప్పించాలని వేడుకుంటున్న ఓ వీడియో వైరల్ గా మారింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శాస్త్రినగర్ కు చెందిన సిల్వేరి రితీష్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం బతుకు ధేరువు కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి దొరకక ఆకలితో అలమటిస్తున్నాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తనను భైంసాకు రప్పించాలని వేడుకుంటున్నాడు.