కర్నూలు నగరాన్ని రాష్ట్రంలోనే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలబెట్టేలా పారిశుద్ధ్య విభాగ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో శానిటేషన్ ఇంస్పెక్టర్లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అంతకుముందు స్మార్టన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగ నివారణ, చెత్త సేకరణ వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత చైతన్య కార్యక్రమాలు చేపట్టడంపై చర్చించారు.